prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 9:19 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బద్వేల్ మండలం చింతలచెరువు సర్పంచ్ అభ్యర్థిగా ద్వారంపూడి లావణ్య నామినేషన్ దాఖలు

బద్వేల్,నవంబర్ 16 ప్రజావాణి బద్వేల్ మండల పరిధిలోని చింతలచెరువు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి జరిగే ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. చింతలచెరువు సర్పంచ్ అభ్యర్థిగా కడప జిల్లా సేవాదళ్ అధ్యక్షులు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సతీమణి ద్వారంపూడి లావణ్య సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. పుట్టాయపల్లె గ్రామ సచివాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆమె తన నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.నామినేషన్ దాఖలు చేసేందుకు ముందు ద్వారంపూడి లావణ్య తన మద్దతుదారులు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు యువతతో కలిసి భారీ ర్యాలీగా పుట్టాయపల్లె సచివాలయానికి చేరుకున్నారు. గ్రామస్తుల ఆశీస్సులు తీసుకుని ఉత్సాహభరిత వాతావరణంలో ఆమె నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.గ్రామ సమగ్రాభివృద్ధే నా ప్రధాన లక్ష్యం:నామినేషన్ దాఖలు అనంతరం ద్వారంపూడి లావణ్య మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలకు కీలక హామీలు ఇచ్చారు. చింతలచెరువు గ్రామ అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. గ్రామస్తులందరూ తనను ఆశీర్వదించి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.“గ్రామంలోని మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్య పరిష్కారం, అంతర్గత రహదారుల నిర్మాణం,పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నేరుగా అందేలా కృషి చేస్తాను.గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా,మీ ఇంటి ఆడపడుచుగా ముందుండి పరిష్కరిస్తాను.మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చింతలచెరువును మండలంలోనే ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాను“అని లావణ్య భరోసా ఇచ్చారు.భారీగా తరలివచ్చిన నాయకులు, గ్రామస్తులు:ఈ నామినేషన్ కార్యక్రమంలో కడప జిల్లా సేవాదళ్ అధ్యక్షులు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డితో పాటు చింతలచెరువు,పుట్టాయపల్లె గ్రామాలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు,సీనియర్ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు,యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని లావణ్యకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్నికల్లో ఆమె విజయం కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తామని మద్దతుదారులు తెలిపారు.