మదర్ సర్వీస్ సొసైటీ సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు.డాక్టర్ మల్లాది ప్రసాదరావుకు జాతీయ సేవారత్న పురస్కారం
గుంటూరు,నవంబర్ 16:ప్రజావాణి సమాజమే కుటుంబంగా భావిస్తూ నిరుపేదలు,అభాగ్యులు,వృద్ధులు, నిరాశ్రయుల సంక్షేమమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ జర్నలిస్టు,మదర్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మల్లాది ప్రసాదరావుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.ఆయన అందిస్తున్న విశిష్ట సామాజిక సేవలను గుర్తించిన అఖిలభారత ఎన్జీవో వెల్ఫేర్ అసోసియేషన్, కేబీఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా జాతీయ సేవారత్న అవార్డుతో ఘనంగా సత్కరించాయి.అఖిలభారత ఎన్జీవో వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కేబీఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవకుల 8వ వార్షికోత్సవ వేడుకలు...