జనసంద్రంగా మారిన పోరుమామిళ్ల.నల్లేరు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో షేక్ సునిహ నామినేషన్
పోరుమామిళ్ల (వైఎస్ఆర్ జిల్లా):నవంబర్ 16ప్రజావాణి పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థిగా షేక్ సునిహ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. విశ్వనాథరెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీకి వేలాది మంది ప్రజలు, వైసీపీ శ్రేణులు తరలిరావడంతో పోరుమామిళ్ల పట్టణం జనసంద్రంగా మారింది.అన్వర్ భాష వారసురాలిగా బరిలోకి.గ్రామంలో కొత్త ఉత్సాహం గత 30 ఏళ్లుగా పోరుమామిళ్ల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని, నిత్యం ప్రజాసేవలో నిమగ్నమైన...