నాగలకుంట్ల (సంచర్ల) సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల లక్ష్మీదేవి నామినేషన్ దాఖలు • భారీగా తరలివచ్చిన నాలుగు గ్రామాల యువత, టీడీపీ శ్రేణులు

• మహిళలు,యువత నుండి వెల్లువెత్తుతున్న సంపూర్ణ మద్దతు • గ్రామాల సమగ్రాభివృద్ధి,తండ్రి ఆశయ సాధనే లక్ష్యమన్న లక్ష్మీదేవి పోరుమామిళ్ల: నవంబర్16 ప్రజావాణి మండల పరిధిలోని నాగలకుంట్ల (సంచర్ల) గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ముత్యాల లక్ష్మీదేవి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాలకు చెందిన యువత,తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెకు సంఘీభావం తెలిపారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి వచ్చి,గ్రామాల రూపురేఖలు మార్చడంలో క్రియాశీలక పాత్ర పోషించాలనే...