తండ్రి బైరవ ప్రసాద్ బాటలోనే ప్రజాసేవ.. టేకురుపేట సర్పంచ్ అభ్యర్థిగా బైరవ శివసాహితి నామినేషన్

పోరుమామిళ్ల (కడప జిల్లా)నవంబర్ 16ప్రజావాణి పోరుమామిళ్ల మండలంలోని టేకురుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పోరుమామిళ్ల మండల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు బైరవ ప్రసాద్ కుమార్తె బైరవ శివసాహితి,టేకురుపేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు,కార్యకర్తలు, అనుచరులు మరియు గ్రామ పెద్దలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.తండ్రి ఆశయాల సాధనే లక్ష్యం నామినేషన్ ప్రక్రియ అనంతరం బైరవ శివసాహితి...