వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని రైతు ఆత్మహత్య
– కుటుంబ ఆర్థిక ఇబ్బందులతోనే అఘాయిత్యానికి పాల్పడినట్లు భార్య ఫిర్యాదు
షాబాద్, ప్రజావాణి నవంబర్ 16
షాబాద్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోడంపహాడ్ గ్రామానికి చెందిన చెర్లగూడెం వెంకటయ్య (45) వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం (నవంబర్ 15) వెంకటయ్య తన భార్య వరలక్ష్మితో కలిసి మన్‌మర్రి గ్రామ పరిధిలోని తమ వ్యవసాయ పొలానికి పత్తి ఏరేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఉదయం సుమారు 10 గంటల సమయంలో వెంకటయ్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అరగంట తర్వాత భార్య వరలక్ష్మి నేరేడు చెట్టు కిందకు వెళ్లి చూడగా, వెంకటయ్య చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది కనిపించాడు.
కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెంకటయ్య కొంతకాలంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు భార్య తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై షాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.