-లీలా హాస్పిటల్ సిబ్బందికి దుప్పట్ల పంపిణీ
-లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎలైట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 16
మిర్యాలగూడలోని లీలా హాస్పిటల్ యాజమాన్యం వారి సహకారంతో, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎలైట్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా 16-11-2026 నాడు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా లీలా హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్న సుమారు 70 మంది సిబ్బందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఆసుపత్రిలో నిరంతరం సేవలందిస్తూ రోగులకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న సిబ్బందిని అభినందిస్తూ, చలికాలంలో వారికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎలైట్ అధ్యక్షులు లయన్ పోతిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కార్యదర్శి లయన్ నాసబోయిన రామకృష్ణ, కోశాధికారి లయన్ గుడిపాటి రవికుమార్, జెడ్సీ లయన్ ఉప్పల రవికుమార్ హాజరయ్యారు.
అదేవిధంగా క్లబ్ సభ్యులు లయన్ ఇంద్రకంటి ఇంద్రారెడ్డి, లయన్ సాధు కిరణ్ కుమార్, లయన్ ఎక్కల చంద్రశేఖర్ , లయన్ రాంబాబు సోమ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో లీలా హాస్పిటల్ మానేజింగ్ డైరెక్టర్ లయన్ రాజేశ్ రెడ్డి కూడా పాల్గొని తమ సహకారాన్ని అందించారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం అందించిన సహకారానికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎలైట్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో సమాజంలోని వివిధ వర్గాలకు సేవలు అందించడమే లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నరు