*మహిళా మెడలో బంగారు మంగళ సూత్రం చోరీ*
*సీసీటీవీ దృశ్యాల సాంకేతిక ఆధారాలతో కేసును చేదించిన పోలీసులు*
*ఇద్దరు నిందితులు అరెస్ట్*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 16 (ప్రజావాణి): మంచాల మండలం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంకు చెందిన వడరాజు అనురాధ (40) గత మంగళవారం సాయంత్రం స్థానిక ఆసుపత్రి మార్గంలో నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా, వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో సంఘటనా స్థలానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల్లో ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామానికి చెందిన
ఈశ్వర పల్లి కరుణాకర్(28) బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నా మండలం మంచాల గ్రామానికి చెందిన ఓరుగంటి శివప్రసాద్ (అలియాస్) రజనీకాంత్ (30) ప్రైవేట్ స్కూల్ డ్రైవర్గా పనిచేస్తూ మంచాలలో నివసిస్తున్నాడు. అదే గ్రామానికి వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. తక్కువ సమయంలోనే సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న క్రైమ్ సిబ్బంది యాదగిరి, రాజు, బాబురావు, చంద్రశేఖర్, మధులను ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్ రెడ్డి అభినందించారు.