prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 1:46 pm Digital Edition : PRAJA VANI

మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవు.ఎస్సై దేవ్ సింగ్

*మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవు.ఎస్సై దేవ్ సింగ్*

డ్రంక్ అండ్ డ్రైవ్ పై వాహనదారులకు అవగాహన కల్పించినఅశ్వారావుపేట పోలీసులు

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 16

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ దేవ్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ దేవ్ సింగ్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అజాగ్రత్త డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. ప్రజల ప్రాణ రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని, రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.