prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 8:51 pm Digital Edition : MAHESH MEDCHAL

భారత్ సమ్మిట్‌లో విదేశీ నేత వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల నిరసన కార్యక్రమం

*భారత్ సమ్మిట్‌లో విదేశీ నేత వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల నిరసన కార్యక్రమం*

*నవంబర్ 17న మేడ్చల్‌లో భారీ ర్యాలీకి పిలుపు*

ఫిలిబెక్‌పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్న బీజేపీ శ్రేణులు: జల్లి శైలజ హరినాథ్*

మేడ్చల్: హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భారత్ సమ్మిట్-2026 వేదికగా యూరోపియన్ సోషలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఇటలీకి చెందిన జియాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయని మేడ్చల్ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ అన్నారు. భారతదేశ అంతర్గత రాజకీయ వ్యవహారాలపై విదేశీ నేత వ్యాఖ్యలు చేయడం, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ రాజకీయ వ్యవహారాల్లో విదేశీ నాయకుల జోక్యం తగదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించిన తీరును కూడా ఆమె విమర్శించారు. భారత్ సమ్మిట్ వేదికగా చోటుచేసుకున్న ఈ పరిణామాలను నిరసిస్తూ నవంబర్ 17వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు మేడ్చల్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు జల్లి శైలజ హరినాథ్ తెలిపారు.
మేడ్చల్ అంబేద్కర్ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ కొనసాగుతుందని, అనంతరం జియాకోమో ఫిలిబెక్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు వెల్లడించారు. దేశ సార్వభౌమాధికారం, గౌరవం వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తం చేయాలని ఆమె పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జాతీయవాదులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జల్లి శైలజ హరినాథ్ పిలుపునిచ్చారు.