prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 9:29 pm Digital Edition : PRAJA VANI

ప్రభుత్వ వైద్య కళాశాలలో న్యాయ అవగాహన

ప్రభుత్వ వైద్య కళాశాలలో న్యాయ అవగాహన

మన సమగ్ర ప్రజావాణి :సంగారెడ్డి నవంబర్:16

ప్రభుత్వ వైద్య కళాశాలలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
ఈరోజు సంగారెడ్డిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంగారెడ్డి ఆధ్వర్యంలో కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి బి. సౌజన్య గారు న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రూపొంది రూపొందించిన
డ్రగ్ అవేర్నెస్ అండ్ వెల్నెస్ నావిగేషన్ (దావన్ )స్కీం

గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే అనర్థాలు, యువతపై వాటి ప్రభావం, మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించాల్సిన ఆవశ్యకత, బాధితులకు అందుబాటులో ఉన్న సహాయ సేవలు మరియు పునరావాస మార్గాల గురించి వివరించారు అదేవిధంగా ర్యాగింగ్ నిషేధ చట్టం, పోక్సో చట్టం పోకసో (యాక్ట్ )సైబర్ నేరాలు మరియు వాటికి సంబంధించిన చట్టపరమైన నిబంధనలపై అవగాహన కల్పించారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడటం చట్టరీత్యా నేరమని, విద్యార్థులు పరస్పరం గౌరవం, స్నేహభావంతో మెలగాలని సూచించారు పోక్సో చట్టం ద్వారా బాలబాలికలకు కల్పించబడిన రక్షణ, బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన నేరాలు, బాధిత పిల్లలకు అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణ మరియు న్యాయ సహాయం గురించి వివరించారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, వ్యక్తిగత సమాచార భద్రత మరియు సైబర్ నేరాల బారిన పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు తమ హక్కులు, బాధ్యతలను గుర్తించి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని కార్యదర్శి సూచించారు. చట్టపరమైన సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు