ప్రగతి పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ప్రగతి పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలుసిరిసిల్ల, నవంబర్ 16: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో గల ప్రగతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు కార్యక్రమాలను నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ఏడవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. ఉపాధ్యాయుల పాత్రను పోషిస్తూ బోధన చేయడంతో పాటు, ఆ బాధ్యతల్లో తమకు ఎదురైన అనుభవాలను తోటి విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు...