prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 4:26 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

పాత్రికేయులకు , ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: పత్తిపాక వెంకటేష్

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి మండల మీడియా మిత్రులకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు పత్తిపాక వెంకటేష్ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అక్షరాన్ని ఆయుధంగా మలిచిన పాత్రికేయులకు, ఉద్యమకారులకు పార్టీలకు అతీతంగా రెండు గుంటల ఇళ్ల స్థలం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను కోరారు. జిల్లాలో ‘జర్నలిస్టు కాలనీ’, ‘తెలంగాణ ఉద్యమకారుల కాలనీ’ పేర్లతో స్థలాలు కేటాయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.