prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 6:32 pm Digital Edition : ANILKOTAGIRI KOTAGIRI

నిజాంసాగర్‌లో నీళ్లున్నా రైతులకు క్రాప్ హాలిడేనా ?

నిజాంసాగర్‌లో నీళ్లున్నా రైతులకు క్రాప్ హాలిడేనా ?

9.16 టీఎంసీల నీటి వినియోగంపై స్పష్టత ఇవ్వాలి.

రైతులకు 18 గంటల విద్యుత్ సరఫరా చేయాలి.

ధాన్యం ధరలు తగ్గినా పట్టించుకునేవారేరీ ?

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలేవి ?

ముఖ్యమంత్రి,పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించాలి.

బీఆర్ఎస్ నేతలు మోరిల్ శ్రీనివాస్ రావు,అంజిరెడ్డి.

క్రాప్ హాలిడే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్ ఎస్ నేతలు,రైతుల డిమాండ్.

బాన్సువాడ/ప్రజావాణి:-నిజాంసాగర్ ప్రాజెక్టులో సాగునీటికి సరిపడా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రబీ పంటల సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించడం రైతులకు అన్యాయం చేయడమేనని బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయ కులు మోరిల్ శ్రీనివాస్ రావు,మాజీ జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి విమర్శించారు.సోమవారం మోరిల్ శ్రీనివాస్ రావు నివాసం వద్ద రైతులు,నాయకులు,కార్యకర్త లతో కలిసి క్రాప్ హాలిడే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు నిరసన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం మోరిల్ శ్రీనివాస్ రావ్ ఇంటి నుండి బైక్ ర్యాలీ చేపట్టి ఆర్డీవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు,రైతులు మాట్లాడు తూ.నిజాంసాగర్ ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటికి ఎంత,సాగునీటికి ఎంత కేటాయిస్తారో ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని నాయకులు కోరారు.నాలుగు విడతల్లో ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేస్తే పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. నీటి విడుదల తేదీలు,సరఫరా ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఆయకట్టు పరిధిలో లేని భూముల్లో బోర్ల ద్వారా సాగు చేస్తున్న రైతులకు రోజుకు 18 గం.ల నాణ్య మైన విద్యుత్ అందించాలని కోరారు.గత బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో రైతుబంధు,రైతుబీమా,సాగునీరు,విద్యుత్ ద్వారా రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు.ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులు సాగునీరు,విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం జరుగుతోందని నాయకు లు ఆరోపించారు.గతంలో క్వింటాల్ ధాన్యానికి రూ.3,800 వరకు ధర లభించగా ప్రస్తుతం రూ.2,700కు పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ధాన్యం కొనుగోలు చేయాలనుకునే వ్యాపారులను స్థానిక వ్యాపారులు,రైస్ మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి అడ్డుకుంటు న్నారని ఆరోపించారు.దీంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని నాయ కులు విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని సమర్థవం తంగా వినియోగించుకోలేకపోవడం వల్ల సాగునీటి సమస్య లు మరింత పెరిగాయని ఆరోపించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహా దారు పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గ రైతుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు.నిజాం సాగర్‌లోని నీటిని ఎలా వినియోగిస్తారు? సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారు? అనే అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని కేటాయించిన అనంతరం మిగిలిన నీటిని సాగుకు వినియోగించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.క్రాప్ హాలిడే నిర్ణయాన్ని రద్దు చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్ర మంలో బీఆర్ఎస్ నాయకులు డా.ఎం.ఏ.హకీమ్,సీమల శ్రీనివాస్ యాదవ్,మోచి గణేష్,అబ్దుల్ ఖాదర్,కల్వకుంట్ల వసంత్ రావు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.