prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 9:21 pm Digital Edition : PRAJA VANI

జీవో నెంబర్ 25 ను సవరించాలి: టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్

జీవో నెంబర్ 25 ను సవరించాలి: టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
​నిబంధనలకు విరుద్ధంగా వర్క్ అడ్జస్ట్‌మెంట్ జరిగిందని ఆరోపణ
​పారదర్శకంగా సర్దుబాటు చేయాలని ఎంఈవో, డీఈవోలకు వినతి

పరిగి/​కుల్కచర్ల:నవంబర్ 16,ప్రజావాణి :

ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 25 ను సవరించి, ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని టీఎస్‌యూటీఎఫ్ (TSUTF) కుల్కచర్ల మండల శాఖ డిమాండ్ చేసింది. ప్రస్తుతం జీవో నెంబర్ 25 ప్రకారం చేపడుతున్న ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్‌మెంట్ (సర్దుబాటు) ప్రక్రియ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని యూనియన్ నేతలు తీవ్రంగా ఖండించారు.
​ఈ సర్దుబాటు ప్రక్రియలో ఎలాంటి పారదర్శకత పాటించలేదని ఆరోపిస్తూ టీఎస్‌యూటీఎఫ్ కుల్కచర్ల మండల శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారిని (MEO) కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ప్రక్రియపై పునరాలోచించి, పారదర్శకంగా సర్దుబాటు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
​డీఈవో సానుకూల స్పందన:
అనంతరం ఈ విషయంపై జిల్లా విద్యాధికారిని (DEO) కూడా కలిసి, సర్దుబాటులో జరిగిన లోపాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై డీఈవో సానుకూలంగా స్పందిస్తూ.. వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియపై పునఃసమీక్ష నిర్వహిస్తామని, ఏ ఒక్క ఉపాధ్యాయుడికి అన్యాయం జరగకుండా పూర్తిగా నిబంధనలకు లోబడి సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు.
​ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం, జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, కుల్కచర్ల మండల అధ్యక్షులు వి. రమేష్, ప్రధాన కార్యదర్శి ఎం.డి. అజ్మత్, గౌరవ అధ్యక్షులు ఎస్. రమేష్, నాయకులు వెంకటేష్, శ్రీనయ్య, కృష్ణయ్య, బాధిత ఉపాధ్యాయులు చందర్, శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు