prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 6:08 pm Digital Edition : PRAJA VANI

జవహర్ నగర్ గబ్బిలాల పేటలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు..

జవహర్ నగర్ గబ్బిలాల పేటలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు..మాజీ మేయర్ మరియు జవహర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్

జవహర్ నగర్ నవంబర్ 16 (ప్రజావాణి ప్రతినిధి )

జవహర్ నగర్ పరిధిలోని గబ్బిలాల పేటలో స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ మరియు జవహర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని, స్థానిక ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు చేపట్టారు.

విద్యుత్ స్తంభాల ఏర్పాటు ద్వారా ఆ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం మరింత మెరుగుపడటంతో పాటు, స్థానిక ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు తగ్గనున్నాయి.

ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, జవహర్ నగర్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న శాంతి కోటేష్ గౌడ్ స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

కల్లేపల్లి సదానంద్,
డి సి సి సెక్రటరీ

ఎర్రగుడ్ల వెంకటేశ్వర్,
జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి

మాట్లా శ్రీనివాస్
SC సిల్ బ్లాక్ అధ్యక్షులు,

మంద ఆనంద్,
సుబ్రహ్మణ్యం,
అంజయ్య,
మరియు గబ్బిలాల పేట స్థానికులు ఉన్నారు.