prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 8:32 am Digital Edition : PRAJA VANI

జగ్గారెడ్డి దంపతులకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేత

జగ్గారెడ్డి దంపతులకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేత

• శాలువాలతో సత్కరించి, స్వీట్లు అందజేసిన కాబోయే వియ్యంకుడు రమేష్ పటేల్ దంపతులు

• ఈ నెల 25న సంగారెడ్డి గంజ్ మైదాన్‌లో భరత్ సాయి రెడ్డి – పాలక్ పటేల్ వివాహం

మన ప్రజావాణి | సంగారెడ్డి | నవంబర్ 16 | జిల్లా ప్రతినిధి

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి దంపతులకు కాబోయే వియ్యంకుడు రమేష్ పటేల్ దంపతులు ఆదివారం వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. సంగారెడ్డి పట్టణంలోని రామ్‌నగర్‌లో ఉన్న జగ్గారెడ్డి స్వగృహానికి చేరుకున్న రమేష్ పటేల్ దంపతులు సంప్రదాయబద్ధంగా శాలువాలతో సత్కరించి, స్వీట్లు అందజేస్తూ వివాహానికి ఆహ్వానించారు.

జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి దంపతుల కుమారుడు భరత్ సాయి రెడ్డి, రమేష్ పటేల్ దంపతుల కుమార్తె పాలక్ పటేల్ వివాహం ఈ నెల 25న సంగారెడ్డి పట్టణంలోని గంజ్ మైదాన్‌లో వైభవంగా జరగనుంది.

ఈ కార్యక్రమంలో కాబోయే వధూవరులు భరత్ సాయి రెడ్డి, పాలక్ పటేల్‌తో పాటు జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి, అల్లుడు గుణ చైతన్య రెడ్డి, ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.