చేయూత, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ
• అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
అందోల్ | నవంబర్ 16 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి
అందోల్ నియోజకవర్గంలోని అందోల్–జోగిపేట మున్సిపల్ పరిధిలో ఈరోజు చేయూత, ఒంటరి మహిళల పింఛన్ లబ్ధిదారులకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి పింఛన్ లబ్ధిదారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించారు.