prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 2:07 pm Digital Edition : PRAJA VANI

చండూరులో అసంపూర్తిగా ఆర్ & బి రోడ్డు – ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

*చండూరులో అసంపూర్తిగా ఆర్ & బి రోడ్డు – ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు*

*చండూరు ప్రతినిధి – ప్రజావాణి*

చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో ఆర్ & బి రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వేసి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తి కాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసిన రోడ్డు మధ్యలో డివైడర్ వేయడం మరిచిపోవడం తో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని వాపోతున్నారు. దీని వలన వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొందని, రోజూ ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని అంటున్నారు. తొందరగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి, డివైడర్ ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.