కేజీబీవీ విద్యార్థినులకు సామగ్రి పెట్టెల పంపిణీ
కేజీబీవీ విద్యార్థినులకు సామగ్రి పెట్టెల పంపిణీ విద్యార్థినుల అవసరాలకు చేయూతనందించిన సర్పంచ్ డాక్టర్ కనికిరెడ్డి సతీష్ ఓదెల, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి: ఓదెల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులకు సామగ్రి పెట్టెలను గ్రామ సర్పంచ్ డాక్టర్ కనికిరెడ్డి సతీష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. విద్యార్థినుల అవసరాలను గుర్తించి వారికి ఉపయోగపడే విధంగా ఈ పెట్టెలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ డాక్టర్ కనికిరెడ్డి సతీష్ మాట్లాడుతూ విద్యార్థినులు విద్యతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకోవాలని సూచించారు....