కేజీబీవీ విద్యార్థినులకు సామగ్రి పెట్టెల పంపిణీ
విద్యార్థినుల అవసరాలకు చేయూతనందించిన సర్పంచ్ డాక్టర్ కనికిరెడ్డి సతీష్
ఓదెల, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి:
ఓదెల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులకు సామగ్రి పెట్టెలను గ్రామ సర్పంచ్ డాక్టర్ కనికిరెడ్డి సతీష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. విద్యార్థినుల అవసరాలను గుర్తించి వారికి ఉపయోగపడే విధంగా ఈ పెట్టెలను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ డాక్టర్ కనికిరెడ్డి సతీష్ మాట్లాడుతూ విద్యార్థినులు విద్యతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థి దశ ఎంతో విలువైనదని, ఈ దశలోనే మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని అన్నారు. విద్యార్థినులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న బాలికలకు ప్రోత్సాహం అందించడం ద్వారా వారి విద్యాభివృద్ధికి తోడ్పడినవారమవుతామని తెలిపారు. విద్యార్థినులు అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి కే. జ్యోతి, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. సామగ్రి పెట్టెలు అందుకున్న విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేశారు.