prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 3:42 pm Digital Edition : PRAJA VANI

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. పింఛన్‌తో పేదల కళ్లలో ఆనందబాష్పాలు

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. పింఛన్‌తో పేదల కళ్లలో ఆనందబాష్పాలు!

• నేరేడుగుంట, మక్తగూడెం గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేసిన సర్పంచ్ ఒగ్గు సాయికిరణ్ యాదవ్

నేరేడుగుంట – మక్తగూడెం | నవంబర్ 16 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి

ఎన్నో సంవత్సరాలుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాల నిరీక్షణకు తెరపడింది. నేరేడిగుంట, మక్తగూడెం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సర్పంచ్ ఒగ్గు సాయికిరణ్ యాదవ్ పింఛన్ పత్రాలను అందజేశారు. ఏళ్ల తరబడి పింఛన్ కోసం ఎదురుచూసిన అమ్మలు, అవ్వలు, ఒంటరి మహిళలకు పింఛన్ పత్రాలు అందడంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. పింఛన్ పత్రాలు చేతుల్లోకి రాగానే కొందరి కళ్లలో ఆనందబాష్పాలు కనిపించగా, మరికొందరి ముఖాల్లో చిరునవ్వులు విరబూశాయి. లబ్ధిదారుల ఆనందాన్ని చూసిన సర్పంచ్ ఒగ్గు సాయికిరణ్ యాదవ్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఈశ్వర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.