prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 3:54 pm Digital Edition : PRAJA VANI

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. పోతిరెడ్డిపల్లిలో పెన్షన్ల పంపిణీ

*ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. పోతిరెడ్డిపల్లిలో పెన్షన్ల పంపిణీ*

• వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్ విజయలక్ష్మి

పోతిరెడ్డిపల్లి | నవంబర్ 16 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి

అందోల్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళల కల నెరవేరింది. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయడంతో గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి వారికి పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఏళ్ల తరబడి ఎదురుచూసిన తమకు పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పెన్షన్లు తమకు ఆర్థికంగా ఎంతో ఆసరాగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.