ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం రొయ్యపల్లి మల్లేష్ గౌడ్
"పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం* *298వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్* మేడ్చల్: పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని 298వ డివిజన్ పూడూర్–కిష్టాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి సొంతింటి సౌభాగ్యం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 298వ డివిజన్ పూడూర్–కిష్టాపూర్ పరిధిలో...