ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కవితక్కను విమర్శించే నైతిక హక్కు లేదు:
సలేంద్ర కొమురయ్య యాదవ్
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 16
పెద్దపల్లి: బహుజనవాదం పేరుతో రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయ ప్రయోజనాల కోసం అదే బహుజనవాదాన్ని తాకట్టు పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కవితక్కను విమర్శించే అర్హత, స్థాయి, నైతిక హక్కు లేదని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ అన్నారు.
హరీష్ రావు వద్ద రాజకీయ విధేయతకు అలవాటు పడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం తన స్థాయిని మరిచి కవితక్కపై విమర్శలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. కవితక్కను విమర్శించే ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన రాజకీయ ప్రస్థానం, గతంలో అనుసరించిన వైఖరి, వ్యవహారశైలిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బహుజనవాదం గురించి మాట్లాడే ముందు దాని పట్ల తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవు పలికారు. ఇకపై కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని సలేంద్ర కొమురయ్య యాదవ్ హెచ్చరించారు.