తండ్రి ఆశయ సాధన కోసం రాజకీయo నాగలకుంట్ల (సంచర్ల) సర్పంచ్ బరిలో ముత్యాల లక్ష్మీదేవి

పోరుమామిళ్ల:నవంబర్ 15ప్రజావాణి పోరుమామిళ్ల మండల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.తన తండ్రి కన్న రాజకీయ,అభివృద్ధి కలలను సాకారం చేయడంతో పాటు, సొంత గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముత్యాల లక్ష్మీదేవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.మండలంలోని నాగలకుంట్ల (సంచర్ల) గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఆమె ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.ఈ మేరకు సోమవారం నాలుగు గ్రామాలకు చెందిన యువత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానుల భారీ సమీకరణ నడుమ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు.తండ్రి ఆశయాలు.కుటుంబ అండదండలు తన తండ్రి...