prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 10:22 am Digital Edition : PRAJA VANI

హైదరాబాద్ కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.

హైదరాబాద్ కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు……

*మన ప్రజావాణి*
*మందమర్రి*

నవంబర్ 14 అంటేనే గుర్తుకు వచ్చేది చాచా నెహ్రు పుట్టినరోజు, పండిత్ జవహర్ లాల్ నెహ్రు భారత దేశ మొదటి ప్రధాన మంత్రి, ఆయనకు పిల్లలు, గులాబీలు అంటే చాలా ఇష్టం, అందుకే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటారు.. శనివారం మందమర్రి పట్టణం లోని హైదరాబాద్ కృష్ణవేణి పాఠశాలలో బాలల దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా విద్యార్థిని విద్యార్థులు రకరకాల వేషదారణలతో కనువిందు చేశారు.అనంతరం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి,ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రాం వేణు, ప్రిన్సిపాల్ గుణవతి, ఉపాధ్యాయ బృందం, మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు..