వాగ్దేవి స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
వాగ్దేవి స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం పలువేషధారణల్లో అలరించిన చిన్నారులు.. ప్రజావాణి,ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి లోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుక ఆదివారం కరస్పాండెంట్ చిన్నాలా కట్టయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నేడు పుస్తకాలు పట్టిన చేతులతో, రేపు దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుక పోతామని చిన్నారులు ఎలుగెత్తి చాటారు. పలు వేషధారణలో చిన్నారులు అలరించారు.ఖాకీ దుస్తులో పోలీస్ అధికారిగా,తెల్ల కోటుతో డాక్టర్ గా,టై కట్టుకుని కలెక్టర్ గా కనిపిస్తూ భవిష్యత్తును గెలవాలనే కసి స్పష్టంగా కనిపించింది....