prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 9:26 am Digital Edition : PRAJA VANI

వాగ్దేవి స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం

వాగ్దేవి స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
పలువేషధారణల్లో అలరించిన చిన్నారులు..
ప్రజావాణి,ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి లోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుక ఆదివారం కరస్పాండెంట్ చిన్నాలా కట్టయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
నేడు పుస్తకాలు పట్టిన చేతులతో, రేపు దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుక పోతామని చిన్నారులు ఎలుగెత్తి చాటారు. పలు వేషధారణలో చిన్నారులు అలరించారు.ఖాకీ దుస్తులో పోలీస్ అధికారిగా,తెల్ల కోటుతో డాక్టర్ గా,టై కట్టుకుని కలెక్టర్ గా కనిపిస్తూ భవిష్యత్తును గెలవాలనే కసి స్పష్టంగా కనిపించింది. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కట్టయ్య మాట్లాడుతూ, మేము పిల్లలకు చదువు మాత్రమే చెప్పడం లేదు, కలలు కనడం నేర్పిస్తూ వాటి సాకారానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం శిరీష, అప్సర,నవ్య,షహీన్,శ్రీలత,స్రవంతి పెద్ద ఎత్తున పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.