మహాసభలకు తరలిన సిపిఎం శ్రేణులు..
ప్రజావాణి,నెల్లికుదురు: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కేంద్రమైన నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ అఖిలభారత మహాసభలకు నెల్లికుదురు మండలం నుంచి సిపిఎం శ్రేణులు ఆదివారం తరలి వెళ్లాయి. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు మాట్లాడుతూ ఈ మహాసభలు రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగ భవిష్యత్తు, రైతుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై దేశవ్యాప్త చర్చకు కీలక వేదికగా నిలవనున్నాయని పేర్కొన్నారు.తరలివారీలో సిపిఎం మండల కార్యదర్శి ఇసం పెల్లి సైదులు,నాయకులు పెరుమాండ్ల బాబు గౌడ్,తోటనరసయ్య,వెంకన్న, పుల్లయ్య,చంద్రయ్య,ఉప్పలయ్యశ్రీను,పద్మ,సంగీత,ఎల్లయ్య,బాణాల యాకయ్య,మచ్చ వెంకన్న, పాయిలి వెంకన్న,ముత్తయ్య,ఏ జనార్ధన్ తదితరులు ఉన్నారు.