బద్వేల్ నియోజకవర్గంలో నేటి నుంచి సర్పంచ్ నామినేషన్ల సందడి
నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు.. 144 సెక్షన్ అమలు.. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక కలసపాడు,నవంబర్ 15 ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. ఆదివారం ఉదయం నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ప్రధాన కేంద్రాలైన రాజుపాలెం, కలసపాడు, శంఖవరం నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా...