ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడండి
మేడ్చల్: మేడ్చల్ రెవిన్యూ సర్వే నెంబర్ 66లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడాలని కోరుతూ చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్ వివిధ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి మేడ్చల్ ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. మేడ్చల్లోని టీటీడీ కళ్యాణ మండపం, సీఎంఆర్ షాపింగ్ మాల్ వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసి షెడ్డు నిర్మించారని వారు ఆరోపించారు. డబిల్పూర్కు చెందిన రాజమల్లా రెడ్డి ఈ స్థలాన్ని దారి పేరుతో ఆక్రమించి నిర్మాణం చేపట్టారని వినతిపత్రంలో పేర్కొన్నారు. రెవిన్యూ సర్వే నెంబర్...