పెనుమూరులో హైదరాబాద్ వాసి ఆత్మహత్య
ఫ్యాన్‌కు ఉరివేసుకుని 63 ఏళ్ల వ్యక్తి మృతి
పెనుమూరు (ప్రజావాణి ప్రతినిధి)
పెనుమూరు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 63 ఏళ్ల ప్రకాష్ రావు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.పెనుమూరు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన ప్రకాష్ రావు బెంగళూరులోని ఓ దుకాణంలో పనిచేస్తూ, పెనుమూరు మండలం శాతంభాకంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసు సిబ్బంది కిరణ్, వేదనాయగం, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.