prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 4:14 pm Digital Edition : PRAJA VANI

పట్టణ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇచ్చిన సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి.

పట్టణ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇచ్చిన సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి.

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 15 సత్తెనపల్లి, పల్నాడు జిల్లా

ట్విట్టర్ వేదికగా వైయస్ఆర్సీపీ మహిళలపై అనుచిత వ్యాఖ్యల పోస్టుల పై సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త
డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి

సుధీర్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ
మహిళలపై అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యల పోస్టులను ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగిందన్నారు. ఆ పోస్టులను పెన్ డ్రైవ్ లో కాపీ చేసి కంప్లైంట్ తో పాటు పోలీస్ వారికి అందించడం జరిగిందన్నారు.

సమాజంలో ఎవరైనా సమయమనం పాటించాలని మొన్న పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం గురించి ఎక్కడ మాట్లాడవద్దని మా నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.

ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఐ టి డి పి వారు ఎలాగైనా హింసను ప్రేరేపించే విధంగా వైయస్ఆర్సీపీ మహిళలపై అసభ్యకరమైన పోస్టులను పెట్టారని చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.

కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎక్నాలజీమెంట్ అడిగితే పోలీసు వారు ఇవ్వటం కుదరదని పై అధికారులకు తెలియపరుస్తామని అన్నారు. ఇలాంటి కంప్లైంట్స్ ఎన్నో స్టేషన్లో నమోదు అవుతాయని అన్నిటికీ ఒకే కేసు అవుతుందని అందుకే ఇవ్వటం కుదరదని అన్నారు.

వైసిపి వారిపై అయితే ఒకే కేసు అనేక స్టేషన్లో నమోదు చేసి ఒకసాట బేలు వస్తే మరొక స్టేషన్ కు తీసుకువెళ్లడం ప్రజలందరూ గమనించారని కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఎలా పని చేస్తున్నారో అందరూ చూస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ వార్డు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.