prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 6:59 pm Digital Edition : PRAJA VANI

నూతన వధూవరులను ఆశీర్వదించిన మహదేవుని శ్రీనివాస్

నూతన వధూవరులను ఆశీర్వదించిన మహదేవుని శ్రీనివాస్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 15 (ప్రజావాణి): జనగామ నియోజకవర్గం
కొమురవెల్లి మండలం, గౌరాయపల్లి గ్రామానికి చెందిన నరేడ్ల విజయ మల్లారెడ్డి ఏకైక కుమారుడు సందీప్ రెడ్డి వివాహం సుష్మారెడ్డితో ఆదివారం చేర్యాల–సిద్దిపేట ప్రధాన రహదారిలోని పవార్ కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.