prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 12:02 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రముఖులు

పెద్దపల్లిలో జరిగిన ధర్మారం మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, బోట్ల వనపర్తి సర్పంచ్ సంగ రంజిత్ యాదవ్ – కోమలతల వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, పొనుగోటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త జంట నిండు నూరేళ్లు ప్రేమానురాగాలు, సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని వారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.