నిండలి గ్రామంలో వీధికుక్కల స్వైరవిహారం చిన్నారిపై పిచ్చికుక్క దాడి!
పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పంచాయతీ అధికారులు.పందులు,కుక్కల సంచారంతో ప్రజల్లో భయాందోళనలు. నెల్లూరుఎపిబ్యూరో నవంబర్15(ప్రజావాణి ):బాలాయపల్లి మండలం నిండలి గ్రామంలో వీధికుక్కలు,పందుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. గ్రామంలోని పలు ప్రాంతాల్లో పందులు,కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ పిచ్చికుక్క చిన్నారిపై దాడి చేసి కరవడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.గ్రామంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని,వాటి వల్ల చిన్నారులు,వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కుక్కల బెడదతో పాటు పందుల సంచారం కూడా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది....