నర్మేట కర్మెల్ ప్రార్థన మందిరంలో ఘనంగా బాలల వేడుకలు
నర్మేట కర్మెల్ ప్రార్థన మందిరంలో ఘనంగా బాలల వేడుకలు మద్దూరు నవంబర్14, ప్రజా వాణి, నర్మేట మండలంలోని కర్మెల్ ప్రార్థన మందిరంలో పాస్టర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసు క్రీస్తు దయ వల్ల బాలలు దేవునిలో ఎదిగి మంచి బాలలుగా పేరు ప్రతిష్ఠలు తెచ్చుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలలు పాల్గొన్నారు.