prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 7:24 pm Digital Edition : PRAJA VANI

తెలంగాణ రైతన్నలకు నష్టపరిహారం ఇస్తాలేరు

*తెలంగాణ రైతన్నలకు నష్టపరిహారం ఇస్తాలేరు…*

*సంక్షేమ పథకాలతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభం.*

*50 కోట్లతో గ్లోబల్ సమ్మిట్ సదస్సు అవసరమా.*

*మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యురాలు గొంగడి సునిత మహేందర్ రెడ్డి.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 15*

తెలంగాణ రాష్ట్రం రైతు లకు నష్ట పరిహారం ఇవ్వాలన్న , సంక్షేమ పథకాలు ఇవ్వాలన్న రాష్ట్రం హార్దిక ఇబ్బందు లలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే చెపుతున్నారు. నిన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ సదస్సును 50 కోట్ల రూపాయలను వేచించి నిర్వహించడం అనేది ఆలోచించాల్సిన అంశం. ఇంత కరువులో కూడా స్వయంగా రైతులను అందుకోలేని పరిస్థితులో , సంక్షేమ పథకాలను , ఇచ్చిన హామీలను అమలు చేయని పరిస్థితులో ఉన్నపుడు 50 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అంతర్జాతీయ సదస్సు పెడితే ఎవరికి ఉప యోగం , దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా..? అంతర్జాతీయ సదస్సు పెట్టిన తర్వాత దీనివల్ల ఎలాంటి ఉప యోగాలు ఉన్నాయి. ఎన్ని దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ పాల్గొన్నారు..? ఎన్ని పెట్టుబడులు వచ్చాయి..? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి..? ఎంత మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి దీనికి సంబంధించిన సమగ్ర మైనటువంటి రిపోర్టును ప్రజలకు తెలియ జేయాల్సిన అవసరం ఉంది. ఏమి లేకుండా 50 కోట్లు పెట్టి అంతర్జాతీయ సదస్సు పేరు మీద కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రచారం జరుపుకుందని అపోహ ప్రజలలో ఉంది. వేదిక మీద విదేశాలకు సంబంధించిన ప్రతి నిధులు వేదిక మీద ఉంటారని అనుకున్నాం కానీ పూర్తిగా మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి , మంత్రులు , ఏఐసీసీ నాయకులు వేదిక మీద ఉండడం గమనించాల్సిన విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న సదస్సుగా అందుకు ప్రజల సొమ్ము 50 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ప్రజల ముందు ఉంచాల్సిందిగా
మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు మాజీ శాసన సభ్యురాలు గొంగిడి సునిత మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.