prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 7:26 pm Digital Edition : PRAJA VANI

తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం..

తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం..
మండల మహిళా అధ్యక్షురాలుగా రామతార పద్మ
ప్రజావాణి,నెల్లికుదురు:తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నెల్లికుదురు మండల అధ్యక్షురాలుగా బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన రామతార పద్మ గౌడ్ ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా కేంద్రం మహబూబాబాద్ లోని లండన్ హై స్కూల్ లో ఆదివారం జరిగిన సమావేశంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రామచంద్రయ్య గౌడ్ మహిళ అధ్యక్షురాలుగా రామతార పద్మ గౌడ్ ను ప్రకటించారు. నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గ సంక్షేమానికి,అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

*సామాజిక ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తా..*

తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ,గౌడ జాతి అభ్యున్నతి, సంక్షేమం,సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని సంఘం మండల మహిళా నూతన అధ్యక్షురాలు పెరుమాండ్ల రామ తార పద్మ గౌడ్ తెలిపారు. గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
గౌడ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టు రామచంద్రయ్య గౌడ్,జిల్లా అధ్యక్షులు గండి వీరేందర్ గౌడ్,ఉపాధ్యక్షులు గండి సాయి గౌడ్ యువజన సంఘం అధ్యక్షులు కరింగుల సాగర్ గౌడ్,జిల్లా మహిళా అధ్యక్షులు గండి శారద గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.