prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 10:05 am Digital Edition : PRAJA VANI

తెలంగాణ ఉద్యమకారుడు నాడెల కుమారస్వామి మృతికి ఘన నివాళులు

తెలంగాణ ఉద్యమకారుడు నాడెల కుమారస్వామి మృతికి ఘన నివాళులు

పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన 66వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్

హసన్‌పర్తి,14, మన ప్రజావాణి:

హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలోని హసన్‌పర్తి 66వ డివిజన్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు నాడెల కుమారస్వామి అకాల మరణం చెందడం పట్ల పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన పార్థివ దేహానికి 66వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తెలంగాణ ఉద్యమకారుడైన నాడెల కుమారస్వామి మృతి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకుడు నల్ల కిరణ్, హసన్‌పర్తి వారాల సంఘం అధ్యక్షుడు పావుశెట్టి రాజు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.