prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 10:20 am Digital Edition : PRAJA VANI

జల సంరక్షణే లక్ష్యం.. ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మాణమే ధ్యేయం

**జల సంరక్షణే లక్ష్యం.. ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మాణమే ధ్యేయం!**

హనుమకొండ జిల్లా, వేలేరు మండలం, శాలపల్లి గ్రామంలో జల సంరక్షణకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అడుగులు పడ్డాయి.

గ్రామంలోని శాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉన్న బోరును రీచార్జ్ చేసేందుకు రీసైక్లింగ్ పనులతో పాటు, గ్రామ ఆవాస గ్రామమైన లక్ష్మితండలో వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ గారు ప్రారంభించారు.

వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు, నీటి వృథాను అరికట్టి భవిష్యత్తు తరాలకు నీటి భద్రత కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీఓ బుచ్చిరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్, గ్రామ కార్యదర్శి విజయ్, గ్రామ శాఖ అధ్యక్షులు పోతరబోయిన సతీష్, వార్డు సభ్యులు కాట్రేవుల రాజు, ఎఫ్ఏ సంపత్, గ్రామ పెద్దలు, ఇంకుడు గుంతల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.