చిన్నముప్పారం-చిన్న నాగారంలలో..ఘనంగా బాలల దినోత్సవం గ్రామసభలు.
చిన్నముప్పారం-చిన్న నాగారంలలో.. ఘనంగా బాలల దినోత్సవం గ్రామసభలు. ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం,చిన్ననాగారం గ్రామాలలో శనివారం బాలల దినోత్సవ గ్రామ సభలు ఘనంగా నిర్వహించారు.దేశ తొలి ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలల గ్రామసభలో పిల్లల హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, రక్షణ మరియు వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై సమాలోచనలు చేశారు. *సమిష్టిగా కృషి చేయాలి: సర్పంచి,ఎంఈఓ* బాలల హక్కులను గౌరవిస్తూనే వారి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు తల్లిదండ్రులు...