prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 10:01 am Digital Edition : PRAJA VANI

చిన్నముప్పారం-చిన్న నాగారంలలో..ఘనంగా బాలల దినోత్సవం గ్రామసభలు.

చిన్నముప్పారం-చిన్న నాగారంలలో..
ఘనంగా బాలల దినోత్సవం గ్రామసభలు.
ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం,చిన్ననాగారం గ్రామాలలో శనివారం బాలల దినోత్సవ గ్రామ సభలు ఘనంగా నిర్వహించారు.దేశ తొలి ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బాలల గ్రామసభలో పిల్లల హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, రక్షణ మరియు వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై సమాలోచనలు చేశారు.

*సమిష్టిగా కృషి చేయాలి: సర్పంచి,ఎంఈఓ*

బాలల హక్కులను గౌరవిస్తూనే వారి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు తల్లిదండ్రులు గ్రామస్తులు సమిష్టిగా కృషి చేయాలని చిన్న ముప్పారం సర్పంచి రాయలి భవాని శేఖర్, ఎంఈఓ వెన్న వెంకటరెడ్డి అన్నారు. పిల్లలు ఏ ఏ రంగాలలో ఆసక్తి చూపిస్తున్నారు గమనించి వెన్ను తట్టి ప్రోత్సహించాలని సూచించారు.నిరంతరం బాల బాలికలను గమనిస్తూ సంస్కృతి సాంప్రదాయాలను,చక్కని నడవడిక క్రమశిక్షణల పట్ల ఆసక్తి పెంపొందేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏఏపీసీ చైర్మన్, ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.

*గ్రామ సభలు చక్కని వేదిక: చిన్ననాగారం సర్పంచి*

పిల్లలే దేశ భవిష్యత్తుకు పునాదులని వారి కలలను సాకారం చేయడానికి, వారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, సురక్షితమైన వాతావరణం కల్పించడానికి గ్రామపంచాయతీ తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సర్పంచి చెడపాక సుజాత యాకయ్య హామీ ఇచ్చారు.
బాలల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా బాలల గ్రామసభ ఒక మంచి వేదిక అన్నారు.జిపి కార్యదర్శి పిట్టల శేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్,వార్డ్ సభ్యులు నిడిగంటి చంద్రమౌళి,ముత్యాల సోమక్క,చెడుపాక నరేష్,చెడుపాక అలివేలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బైరు శ్రీనివాస్,దాసరి ప్రకాష్,కొయ్యడి మల్లయ్య, సెర్ఫ్ సీఏ బైరు శ్రీమతి,అంగన్వాడీ టీచర్లు చెడుపాక శ్రీలత,దాసరి కవిత ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
.