prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 8:33 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా జనగామ జిల్లా పంచర్ షాప్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ఘనంగా జనగామ జిల్లా పంచర్ షాప్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 15 (ప్రజావాణి):పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర పంచర్ షాప్ యూనియన్ అధ్యక్షులు ఉప్పుగండ్ల రామారావు, ఉపాధ్యక్షులు మహమ్మద్ యాకూబ్ పాషా, కార్యదర్శి కందగట్ల నాగేష్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా నూనె రాములు, ఉపాధ్యక్షుడిగా బండి వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా దండబోయిన ఉపేందర్, అలాగే ఇస్మాయిల్, కిరణ్, కృష్ణలు బాధ్యతలు స్వీకరించి ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచర్ షాప్ కార్మికులను చైతన్యవంతం చేసి, ప్రతి జిల్లాలో సభ్యులను యూనియన్‌లో చేర్పించి బలోపేతం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కార్మికులకు దక్కాల్సిన హక్కుల సాధన కోసం పోరాడుతామని, వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, ఇందుకు సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర కమిటీకి సహకరించాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యులు మహమ్మద్ రహీం, మహమ్మద్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.