prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 7:08 pm Digital Edition : PRAJA VANI

గబ్బిలాల పేట కాలనీవాసుల వినతి..

గబ్బిలాల పేట కాలనీవాసుల వినతి..

జవహర్ నగర్, నవంబర్ 15 (ప్రజావాణి ప్రతినిధి)

గంబిలాల్ పేట కాలనీకి చెందిన పలువురు కాలనీవాసులు తమ ప్రాంతంలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, సీసీ రోడ్ల నిర్మాణం మరియు డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనుల నిమిత్తం జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మేయర్ శ్రీ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ కలవడం జరిగింది.

ఈ సందర్భంగా చెన్నపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమై, కాలనీలో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సమస్యలు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువచ్చారు.

కాలనీవాసుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని శాంతి కోటేష్ గౌడ్ హామీ ఇచ్చారు.

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం తమ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు.

పాల్గొన్నవారు
డి ఎస్ ఎస్ వెంకటేశ్వర్
ప్రధాన కార్యదర్శి, జవహర్ నగర్
మాజీ కార్పొరేటర్ ప్రేమల శ్రీనివాస్
స్పొక్ పర్సన్
ఆకుల ప్రభాకర్ గౌడ్
వీర్ల బుజంగం
అర్జున్
తదితరులు ఉన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం కాలనీల అభివృద్ధి దేయం