కోర్టు సెలవు… అర్ధరాత్రి కొలువు.

కోర్టు సెలవు... అర్ధరాత్రి కొలువు. .ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి). ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది. ఎన్నిక పూర్తయ్యేంత వరకు పాత కమిటీయే కొనసాగుతుందని న్యాయస్థానం చెప్పిన తరువాత కూడా, గత చైర్మన్ తనకు అనుకూలంగా తెచ్చుకున్న ఉత్తర్వులు చేతిలో ఉంచుకొని అధికారులు పాత వర్గాన్ని తొలగిస్తూ ప్రత్యక్ష రాజకీయాలకు తెరలేపారు. ఉత్తర్వులు జారీ చేసి కొత్త వారికి వీరంగం, అది కూడా పట్టపగలు కాకుండా...