prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 8:48 pm Digital Edition : PRAJA VANI

కార్మిక సమస్యలపై యాజమాన్య వైఖరి సరికాదు

*కార్మిక సమస్యలపై యాజమాన్య వైఖరి సరికాదు*

*ఎస్సిఈయు సిఐటియు రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్*

* *మన ప్రజావాణి మందమర్రి:-*

సింగరేణి కార్మిక సమస్యలపై సింగరేణి యాజమాన్యం, ఇంకా గుర్తింపు ఉందని కొనసాగుతున్న గెలిచిన సంఘాలైన ఏఐటియుసి, ఐఎన్టియుసి లు అవలంబిస్తున్న తీరు సరైనది కాదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులకు యాజమాన్యం సమయానికి ఇచ్చే పనిముట్లు, చలికాలంలో ఇవ్వాల్సిన గరం కోట్లు ఇవ్వలేదని, యాక్టింగ్ ప్యానెల్ లిస్టు గనులపై వేయలేదని, చివరకు గత ఆర్థిక సంవత్సరంలో కార్మికుల వేతనాల నుండి రికవరీ చేసిన సీఎంపిఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలకు కలపారో లేదో తెలియడం లేదని దీనిపై బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. గతంలో ఫిల్టర్ బెడ్ లలో రాత్రి షిఫ్ట్ లలో సెక్యూరిటీ సిబ్బంది నియమించాలని, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడం మూలంగానే గత నెల రోజుల్లో రెండుసార్లు దొంగతనాలు జరిగాయని, ఇప్పటికైనా యాజమాన్యం ఆలోచించి ఫిల్టర్ బెడ్ ల చుట్టూ ఎత్తు గోడలు నిర్మించి, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయి సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని సూచించారు. సింగరేణి వ్యాప్తంగా సెక్యూరిటీ, జూనియర్ అసిస్టెంట్ ఖాళీలలో జనరల్ అసిస్టెంట్లతో తాత్కాలికంగా అవసరం తీర్చుకుంటూ, కాలం గడపకుండా, రిక్రూట్మెంట్ జరపాలని డిమాండ్ చేశారు. లేబర్ కమిషనర్ నిర్వహించిన రెండు సంవత్సరాల గుర్తింపు కాల పరిమితి ముగిసిన యాజమాన్యం అన్ని యూనియన్ లను సమానంగా గుర్తించాలని, కొందరు నాయకులను జనరల్ షిఫ్ట్ లలో, వారి పని కాకుండా ఇతర సులుభం ఉండే పనులలో కొనసాగించడం వలన సాధారణ కార్మికులకు పనులలో ఇబ్బంది కలుగుతుందని, దానితో కార్మికులు డ్యూటీలు చేయలేక నాగాలు అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జడల ప్రవీణ్, భద్రి ఆదర్శ్, భేతి భరత్ చైతన్య లు పాల్గొన్నారు.