prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 7:18 pm Digital Edition : PRAJA VANI

ఏఐకెఎస్ 36వ జాతీయ మహాసభల సందర్బంగా జనగామ సిపిఎం ర్యాలీ.

ఏఐకెఎస్ 36వ జాతీయ మహాసభల సందర్బంగా జనగామ సిపిఎం ర్యాలీ.

రైతు సంక్షేమ హామీల అమలులో సర్కార్ విఫలం

కేంద్ర విధానాలతో వ్యవసాయ రంగం కార్పొరేట్లపరం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి విమర్శ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 15 (ప్రజావాణి): రైతు సంక్షేమ హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని తెలిపారు. ఈ సందర్బంగా ఏఐకెఎస్ 36వ జాతీయ మహాసభలు ఈ నెల 15 నుండి 18 వరకు నల్గొండలో జరుగుతున్న నేపథ్యంలో మహాసభలకు జిల్లా వ్యాప్తంగా సిపిఎం జిల్లా నాయకులు, రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తూ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్బంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి. అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి లు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర విధానాలతో వ్యవసాయ రంగం కార్పొరేట్లపరం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతులకు 40 రకాల హామీలు ఇచ్చినప్పటికీ, వాటిలో కొన్ని మాత్రమే అమలు చేసి, మరికొన్నింటిని పూర్తిగా విస్మరించిందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలనే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని అన్నారు. కేంద్రప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లపరం చేసిందన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేవిధంగా విధానాలను అమలు చేస్తోందన్నారు. రైతులను ఐక్యం చేస్తూ విధానాలపై తిరుగుబాటు చేసేందుకు భవిష్యత్తు కర్తవ్యాల రూపకల్పనకు నల్లగొండలో జరగనున్న అఖిలభారత కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభ వేదిక కాబోతుందన్నారు. వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గడ్డమీద ఏఐకేఎస్‌ ‌జాతీయ మహాసభలు జరగనుండటంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జనగామ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికి రూ.39 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. కనీసం రూ.35 వేల కోట్లు కేటాయిస్తే మెజార్టీ రైతులకు ప్రయోజనం కలుగుతుందని భావించినప్పటికీ, చివరకు రూ.20,616 కోట్లతో సరిపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేండ్లలో అమలు చేసిన, అమలు చేయని హామీలపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. రైతు సంఘాలు, ప్రతిపక్షాలు, వ్యవసాయ నిపుణులను భాగస్వాములను చేసి సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధర, పంట నష్టపరిహారం వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించి అమలు చేయాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్.రాజు, ఎస్.యాదగిరి, ఆర్.సోమయ్య, ఎస్.రమేష్, బి.శేఖర్, 3డవ వార్డు సిపిఎం కౌన్సిలర్ బూడిది జ్యోతి, బి.గోపి, జె.ప్రకాష్, ఎస్.విజేందర్, బి.గణేష్, ఏం.రమేష్, బి. వెంకటేష్, జి.మహేందర్, బి.చందు నాయక్, బి.వెంకటమల్లయ్య, సిహెచ్.సోమన్న, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.