prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 6:52 pm Digital Edition : PRAJA VANI

ఎల్దొండ సోదరులకు కాంగ్రెస్ నేతల పరామర్శ

ఎల్దొండ సోదరులకు కాంగ్రెస్ నేతల పరామర్శ
ప్రజావాణి,ఇనుగుర్తి: మానుకోట జిల్లా ఇనుగుర్తి(పూర్వ నెల్లికుదురు)మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా నేత ఎల్దొండ వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ బి ఆర్ ఎస్ నేత ఎల్దొండ నారాయణరెడ్డి సోదరులకు ఇటీవల మాతృ వియోగంజరిగింది.దీంతో నెల్లికుదురు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి నేతృత్వంలో నాయకులు ఆదివారం లక్ష్మీపురం చేరుకొని స్వర్గీయ వెంకటమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వెంకట్ రెడ్డి,నారాయణరెడ్డి తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి
ధైర్య వచనాలు చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో స్థానిక సర్పంచి ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు ప్రభాకర్ గౌడ్, శ్రీపాల్ రెడ్డి, పొడెట్టి చంద్రయ్య,గండి మురళి, ముత్యాల లచ్ఛయ్య ,వెంకట రెడ్డి, జగన్ బాబు, ముత్యాల వెంకన్న, గండేపల్లి రమేష్ తదితరులు ఉన్నారు